Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 1 వరకు సమర్పణకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దరఖాస్తుల సమర్పణకు వచ్చేనెల ఒకటో తేదీ వరకు అవకాశముందని పేర్కొంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఉషారాణి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఓసీలు రూ.200, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు, ఈడబ్ల్యూ ఎస్ విద్యార్థులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాల కోసం www.tsmodelschools.comవెబ్సైట్ను సంప్ర దించాలని సూచించారు. ఇప్పటి వరకు 57,358 దరఖాస్తులొచ్చాయని వివరించారు.