Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు సమన్వయ కమిటీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినట్టుగా పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలివ్వాలనీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాలు-2022ను ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమెకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ కన్వీనర్లు వేములపల్లి వెంకట్రామయ్య, అంజయ్య నాయక్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, కోశాధికారి అమర్లపూడి రాము, సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య, ప్రసాదన్న పాల్గొన్నారు. తిరస్కరించిన దరఖాస్తులను పున:పరిశీలించాలని మంత్రిని కోరారు. అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా రకరకాల నెపాలతో దరఖాస్తులను తిరస్కరించాటాన్ని సమన్వయ కమిటి వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వాటిపై పరిశీలన చేయాలని కోరారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.