Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతివ్వనున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో మాదిరిగానే హైదరాబాద్ స్థానిక సంస్థల సీటులో తమకు మద్దతు తెలపాలని ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ను కోరిన విషయం విదితమే. ఈ మేరకు పార్టీ సీనియర్లతో చర్చించిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నది.