Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ విధానసభలో మంగళవారం జర్నలిస్టులపై భౌతికదాడి చేసి తవ్రంగా కొట్టడాన్ని జాతీయ జర్నలిస్టుల కూటమి(ఎన్ఏజే) తీవ్రంగా ఖండించింది. అసెంబ్లీ ప్రాంగణంలో సమాజ్‌వాదీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను కవర్ చేయడానికి తెల్లవారుజామున వెళ్లిన రిపోర్టర్లు, కెమెరాపర్సన్లపై మార్షల్స్ దాడికి పాల్పడటం దారుణమని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఎస్.కె పాండే, సెక్రెటరీ జనరల్ ఎన్. కొండయ్య అన్నారు. శివపాల్ యాదవ్, అతని పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు వంద మంది చౌదరి చరణ్ సింగ్ విగ్రహం పక్కన ఆందోళన చేశారని వివరించారు. సాధారణంగా నిరసన జరిగే ప్రాంతం నుంచే మీడియా కవరేజీ ఇస్తుందని చెప్పారు. అసెంబ్లీ మార్షల్స్ ఇంటి బయట ఉండే ప్రాంతంలో కాకుండా లోపల ఆర్డర్‌ను అమలుచేయాలని ఆదేశించారు.
పోలీసులు సమన్వయం చేయలేకపోయారని గుర్తు చేశారు. మార్షల్స్ ఆందోళనకారులు, జర్నలిస్టు లను కొట్టడానికి భవనం నుండి బయటకు వచ్చారని గుర్తు చేశారు. మీడియా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారనడానికి తగిన వీడియో ఆధారాలు సైతం ఉన్నాయని అభిప్రాయపడ్డారు. యూపీ జర్నలి స్టులను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకుకోవడం పట్ల నిరసన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో మీడియాపై పెరుగుతున్న దాడులు చాలా దారుణంగా ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.