Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ఈ విద్యాసంవత్సరం నుంచే కన్సాలిడేట్గా 12 నెలల వేతనమివ్వాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీరియెడ్ విధానం తమకు గుదిబండలా మారిందని తెలిపారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం త్వరగా జీవో విడుదల చేయాలంటూ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు విజ్ఞప్తి చేశారు. గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలకు బడ్జెట్ను విడుదల చేయాలని కోరారు. బదిలీల ద్వారా డిస్టర్బ్ అయిన వారిని మరోచోట సర్దుబాటు చేయాలంటూ ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్మిట్టల్కు సూచించారు.