Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి
- ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
- వివరాలు వెల్లడించిన బస్తర్ ఐజీ
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఆర్జీ బలగాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు జవాన్లు మృతిచెందారని, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని బస్తర్ ఐజీ పి.సుందర్ లాల్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
సుక్మా జిల్లాలోని జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 :30 గంటలకు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సుక్మాకు తరలించి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాయపూర్ పంపించారు. జవాన్ల డీఆర్జీ బృందం కుందేడు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బైక్పై జవాన్లు వెళ్తుండగా.. అకస్మాత్తుగా అడవి నుంచి బుల్లెట్లు దూసుకొచ్చాయని, ఎదురు కాల్పులు జరిపే లోపే ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ముగ్గురు మృతిచెందారని ఐజీ వివరించారు. జేగురుగొండ నివాసి డీఆర్జీ ఎస్ఐ రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ వంజం భీమా నివాసి చిన్తల్నార్ మార్కగూడ, కుంజం భీమా జేగురుగొండ నివాసి చనిపోయారు. ఈ సమయంలోనే ఆ ప్రాంతం నుంచి జవాన్ల ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారని ఐజీ తెలిపారు.