Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు కార్మికుల మృతి
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రా మికవాడలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరే గాయి. పరిసర ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్ముకుంది. సమా చారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు రవీందర్రెడ్డి (25), కుమార్ (24) మృతిచెందారు. జీడిమెట్ల పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.