Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే
నవతెలంగాణ-కోదాడరూరల్
రానున్న ఎన్నికల అనంతరం సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. హాత్ సే హాత్ జోడో, ఇంటింటికీ కాంగ్రెస్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ కంఫర్ట్హాల్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. దేశ సమగ్రతకు సమైక్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ధరలను పెంచి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను తగ్గిస్తున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతోపాటు దేశ సమగ్రతను కాపాడాలని రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాత్‌సే హాత్ జోడో ఇంటికి ఇంటికీ కాంగ్రెస్, గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంతో ప్రజలకు చేర్చాలని సూచించారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఠాక్రే బేటీ అయి దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఠాక్రే పర్యటన ఉంటుందన్నారు. పట్టణంలో గడపగడపకు ఠాక్రే పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంపై పలు అంశాలను సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, నిరంజన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు పాల్గొన్నారు.