Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించుకోవా లని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది. ''దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరను మరో రూ.50 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుంటే... ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారంగా మారుతుంది' అని పేర్కొంది. ''ఈ పెంపుతో, ఎక్కువ మంది ప్రజలు సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను సైతం వదులుకుంటారు. ఇప్పటికే, ఉజ్వల యోజన కింద 10 శాతం మందికి పైగా గత ఏడాదిలో ఎలాంటి రీఫిల్ సిలిండర్లు తీసుకోలేదు. దాదాపు 12 శాతం మంది 1 రీఫిల్ మాత్రమే తీసుకున్నారు. మొత్తం 56.5 శాతం మంది కనీస వార్షిక సగటు 7 పైగా సిలిండర్లకు కేవలం 4 లేదా, అంతకంటే తక్కువ రీఫిల్‌లను మాత్రమే తీసుకున్నారు. సంవత్సరానికి 12 సిలిండర్లు తీసుకొనే అవకాశం ఉంది. కాని తీసుకోలేకపోతున్నారు'' అని స్పష్టం చేసింది. ''కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ ఏడాది రెండోసారి పెంచారు. ఇది మరింత ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తూ అన్ని ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులకు ఇన్పుట్ ఖర్చులను పెంచుతుంది'' అని తెలిపింది. ఈ పెంపుదలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.