Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని టీఎస్‌ట్రాన్స్‌కో జాయింట్ సెక్రటరీ గురువారం ఆ సంస్థలోని సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)లకు ఆహ్వానం పంపారు. ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్‌సౌధలో అధికారులతో జరిగే చర్చల్లో ఒక్కో జేఏసీ నుంచి ఆరుగురు ప్రతినిధులు హాజరు కావాలని షరతు విధించారు. వేతన సవరణ, ఇతర అలవెన్సుల పెంపుపై ఈ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.