Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషిచేస్తామని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు, మహిళలకు భద్రత లేదన్న విషయం స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నదని విమర్శించారు. కళాశాలలో ర్యాగింగ్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలు, రైతులు, విద్యార్థులపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని విమర్శించారు. బంగారు తెలంగాణ హామీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ప్రీతి మృతి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.