Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
డబ్బుల కోసం బాలుడిని గంజాయి గ్యాంగ్ గుట్టల పైకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి హింసించిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురం దానమ్మ జోపిడి కిరణా షాప్‌కి బాలుడు వెళ్లాడు. అక్కడే స్థానికంగా ఉండే గంజాయికి బానిసైన మహ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్ బాలుడికి మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టలపైకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బాలుడిని డబ్బులు ఇవ్వమని అడిగారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో అతన్ని తీవ్రంగా కొట్టి, హింసించారు. కొద్దిసేపటి తర్వాత ఆ బాలుడు వారి నుంచి తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.