Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జి20 ఎంతో ఉపయోగపడుతున్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ 2022 డిసెంబర్ ఒకటి నుంచి 2023 నవంబర్ 30 వరకు జి20 ప్రెసిడెన్సీ పేరుతో జి20పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్లో వాతావరణ మార్పు-సుస్థిర ఆర్థిక వ్యవస్థ నిర్వహించిన కార్యక్రమంలో నిఖిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆర్థికాంశాలతో పాటు ఆయా దేశాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని వివరించారు. పాలనలో వస్తున్న మార్పులపై ఆర్థిక ప్రభావాన్ని వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకుంటున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఐఐటీతో పాటు తొమ్మిది కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.