Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి పుష్పలీల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెరిగిన సిలిండర్ ధరను నిరసిస్తూ... రాష్ట్రంలో బీఆర్ఎస్ దొంగ ధర్నాలు చేస్తున్నదని టీపీసీసీ నేత, మాజీ మంత్రి పుష్పలీల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో సిలిండర్ ధర రూ. 400 ఉండేదనీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అది రూ. 1155కు చేరిందని విమర్శించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తి విఫలమవుతున్నదని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలు నీలిమా, కల్వ సుజాతతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ధర్నాల పేరుతో డ్రామా ఆడుతున్నారని చెప్పారు. కట్టెలతో వంట చేసే పరిస్థితి మళ్ళీ వచ్చిందనీ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. మహిళలకు రక్షణ లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు చేయకుండా ఇక్కడే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య అంశాన్ని చిన్నదిగా చూపించడం సరైందికాదనీ, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.