Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాకతీయ మెడికల్ కాలేజీ అనేస్తీషియా విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ప్రీతి ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, బంధు వులు డాక్టర్ నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రీతి ఫిర్యాదు చేస్తే డాక్టర్ సైప్ లకు కౌన్సిలింగ్ చేయకుండా ప్రీతికే కౌన్సిలింగ్ ఇచ్చారని ప్రీతి సోదరుడు ఆరోపించారు. ప్రీతి కుటుంబ సభ్యులు, ఇతర ప్రజా సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడితో ప్రభుత్వం ఎట్టకేలకు నాగార్జునరెడ్డిపై బదిలీ వేటు వేసింది.