Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిద్రిస్తున్న ముగ్గురు వలస కార్మికులు మృతి
నవతెలంగాణ-రామచంద్రాపురం
సంగారెడ్డి జిల్లా రామచంద్రా పురంలోని కొల్లూరు వద్ద అవుటర్ రింగ్ రోడ్‌పై లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న గుడిసెలోకి దూసు కెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హర్యానా రాష్ట్రానికి చెందిన లారీ బియ్యం లోడ్‌తో పటాన్చెరు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తోంది. మార్గమధ్యంలో కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ అజాగ్రత్త కారణంగా లారీ అదుపుతప్పి పక్కనే గల గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నివాసముంటున్న వలస కార్మికులు.. ఓఆర్ఆర్ చెట్లకు నీరు పోసి జీవనం సాగించే కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాబు రాథోడ్(48), కమలీ భారు(43), బసప్ప రాథోడ్(23) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న మియాపూర్ ఏసీపీ నరసింహారావు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం లోడ్‌తో ఉన్న లారీని భారీ క్రేన్లు, జేసీబీలతో పక్కకు తీయించారు.