Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తైతే 1.5లక్షల ఎకరాలకు నీరు
- గ్యాస్ పెంపుపై బీఆర్ఎస్ ఆందోళనలు బూటకం
- హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్రెడ్డి
నవతెలంగాణ - సైదాపూర్
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్షా 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, కూర్చీ వేసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకని ప్రాజెక్టు మొదలు పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలో పర్యటించారు. ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి స్థానికంగా ఉన్న పాపన్న చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్రెడ్డి మాట్లాడు తూ.. రాచరిక పోకడలకు వ్యతిరేకంగా చేతివృత్తులు, పేదల పక్షాన పోరాడిన సర్దార్ పాపన్న స్ఫూర్తితో నేడు బహుజనులు ఏకమై పోరాడాలన్నా రు. ఇప్పుడు తెలంగాణ ముసుగులో కొంత మంది దొరలు ఈ ప్రాంతాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మైనిం గ్స్ నుంచి రక్షణ కల్పించి ఈ ప్రాంతా న్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్యాస్ ధర పెంపుపై బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలు బూటకమని, రాష్ట ప్రభుత్వం కూడా ధర పెంపుపై వచ్చే నష్టాన్ని భరించ కుండా జనాన్ని తప్పుదోవ పట్టిస్తోం దని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.