Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 57 మందితో కార్యవర్గం
- రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ధర్మానాయక్, శ్రీరాంనాయక్
మిర్యాలగూడ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నూతన కమిటీ గురువారం ఎన్నికైంది. మిర్యాలగూడలోని ముడావత్ బిక్షానాయక్ నగర్లో జరిగిన ఆ సంఘం మూడో మహాసభలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతినిధులు 57 మందితో కూడిన కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో ఆఫీసు బేరర్లుగా 13 మందిని మహాసభ ఎన్నుకుంది. రాష్ట్ర అధ్యక్షులుగా ఎం.ధర్మానాయక్, కార్యదర్శిగా ఆర్.శ్రీరాంనాయక్ తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గుగులోతు ధర్మ, డి.రవినాయక్, గుగులోత్ భీమాసాహెబ్, వి.వీరన్న, కొర్ర శంకర్, సహాయకార్యదర్శులుగా భూక్య వీరభద్రం, ఆంగోత్ వెంకన్న, ఎం.బాలునాయక్, ఎం.రవినాయక్, ఎం.శంకర్నాయక్తోపాటు ఒక మహిళను కోఆష్షన్ సభ్యురాలిగా మహాసభ ఎన్నుకుంది.