Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమెరికా నాసా వారి ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ పోటీలో వరుసగా పదోసారి ప్రపంచ చాంపియన్‌గా శ్రీచైతన్య స్కూల్ నిలిచింది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 30కిపైగా దేశాలు పాల్గొన్నాయి. అందులో భారత్‌ను నెంబర్‌వన్ స్థానంలో శ్రీచైతన్య విద్యార్థులు నిలబెట్టారు. నాసా వారి ఎన్ఎస్ఎస్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన 138 ప్రాజెక్టుల్లో 89 ప్రాజెక్టులు భారత్ నుంచి ఎంపికయ్యాయి. ఇందులో 54 ప్రాజెక్టులు శ్రీచైతన్య నుంచి ఎంపికయ్యాయని ఆ స్కూల్ డైరెక్టర్ సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 729 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఒకటి, రెండు, మూడో బహుమతి, గెలిచిన ప్రాజెక్టుల సంఖ్య, పాల్గొన్న విద్యార్థుల సంఖ్యలో శ్రీచైతన్య విద్యార్థులే ఈ ఘనత సాధించారని వివరించారు. బట్టీపట్టే విధానానికి స్వస్తి పలుకుతూ అవగాహన కల్పించేలా బోధన ప్రక్రియతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంతటి అనితరసాధ్యమైన విజయానికి కారణమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మెన్ బిఎస్ రావు అభినందించారు.