Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాజీపూర్
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సీపీఐ(మావోయిస్టు) కోల్ బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి ప్రభాత్ వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేశారు. లేఖలో పొందుపర్చిన వివరాల ప్రకారం.. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం అలవాటుగా మారిందని, పలు మార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోవడం లేదని పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తూ, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆరిజిన్ డైరీకి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, ఎమ్మెల్యే వల్లనే రైతులు నష్టపోయారని తెలిపారు. ఎమ్మెల్యేకు డైరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేశారని ఆరోపించారు. రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం.