Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లిలోని మదీనా ఎడ్యూకేషనల్ సోసైటీలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అధ్యక్షతన 'టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ-ప్రభుత్వ వైఫల్యం' అనే అంశంపై రాజకీయ పార్టీ అధ్వర్యంలో రౌండ్‌టేబుల్ జరిగింది. ఈ సందర్భంగా ప్రశ్నా పత్రాల వ్యాపార పెద్దలను రాష్ట్ర ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. అందుకే కేసును సిబిఐకి అప్పగించాలనీ, పరీక్షలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదనీ, అందుకే చైర్మెన్, సెక్రటరీలను తొలగించాలనీ, పరీక్షలు వాయిదా కారణంగా నష్టపోయిన విద్యార్థులందరికి రూ 50వేలు ఇవ్వాలనీ, టీఎస్పీఎస్సీ సంస్కరణలను గుర్తించేందుకు సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది.
టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప, సీపీఐ(ఎంఎల్) నేతలు గోవర్ధన్, చలపతిరావు, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, గాలి వినోద్ కుమార్, కాశీం, గద్దర్, విద్యార్థి, యువజన సంఘాల అధ్యక్షులు, ప్రజాసంఘాల నేతలు మాట్లాడారు.