Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యం: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు జరుగ ుతున్నాయనీ, దురదృష్టం ఏమిటంటే తన నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలకు మాత్రం తనకు ఆహ్వానం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాటే తనకు శిరోధార్యం అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తానేందుకు కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని.. ఇటీవల జరిగిన ధర్మసాగర్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి అడగటం వల్ల వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. తన వెంట ఉండే కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులకు కొన్ని అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తనపై ఉందనీ, లేదంటే తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉందన్నారు. పార్టీ పటిష్టతకు దోహదపడే ఆత్మీయ సమావేశాలకు నియోజకవర్గంలోని ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా, కార్పొరేషన్ చైర్మెన్, రాష్ట్ర స్థాయి కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, అందరినీ పిలుచుకొని ఆత్మీయంగా నిర్వహించుకోవాలని స్పష్టంగా సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి ప్రతి ఒక్కరం సహకరించామని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసి వాళ్లని గెలిపించుకున్నామని గుర్తుచేశారు. ఇటీవల సోడాశ్పల్లిలో కేటీఆర్ బహిరంగసభ నిమిత్తం తన దగ్గరికి వచ్చి సాయమడిగారనీ, కానీ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్, పార్టీ గమనిస్తున్నదనీ, ఇలాంటి పద్ధతి సరైంది కాదన్నారు. ఇక్కడ తన నిజాయితీ, తాను చేసిన పనులే తనని ఇప్పటివరకు కాపాడుతున్నాయని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.