Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామ్రేడ్ శేఖర్ జనరిక్ మెడికల్ షాపు ప్రారంభోత్సవంలో డాక్టర్ ఇక్బాల్ జవేద్
నవతెలంగాణ సంతోష్‌నగర్
జనరిక్ మెడిసిన్స్‌నే ప్రభుత్వ వైద్యులు ప్రిస్క్రిప్షన్‌గా రాయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇక్బాల్ జావేద్ సూచించారు. హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో సీఐటీయూ కార్యాలయం ముందు భాగంలో ఆదివారం కామ్రేడ్ శేఖర్ జనరిక్ మెడికల్ షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డా|| జావేద్ మాట్లాడుతూ.. వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించే పని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం బ్రాండెడ్ మందులను కాకుండా జనరిక్ మందులనే ప్రభుత్వ వైద్యులు ప్రిస్క్రిప్షన్‌గా రాయాలని ఉన్నప్పటికీ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బడా ఫార్మా కంపెనీలు వేలకోట్ల రూపాయలను సామాన్య ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి ఎస్. వినరు కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి 12 శాతం మందుల ధరలు పెంచుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీలు కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రావణ్ కుమార్, శేఖర్ సత్తేమని, డాక్టర్ శారద, డాక్టర్ ఫర్వీన్ సుల్తానా, ట్రస్ట్ మెంబర్ సోమయ్య, సోషల్ ఆర్గనైజర్ ఉమర్, ఎండీ.అబ్దుల్ సత్తార్, తదితరులు పాల్గొన్నారు.