Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకం రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఐదు గ్రామాల వారికి వారి ఇండ్ల ఆస్తి వివరాలు అందివ్వాలని కోరారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేస్తే గ్రామీణ ప్రజల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశముంటుందని సూచించారు.