Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ జర్నలిస్టు కెఎల్ రెడ్డి సంస్మరణార్థం ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఏర్పాటైంది. ఈమేరకు తెలంగాణ మీడియా అకాడమీ, కెఎల్ రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. గతంలో కెఎల్ రెడ్డి సంరక్షణార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.15 లక్షలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆశ్రమంలో ఉంటున్న కెఎల్ రెడ్డి బాగోగులు, వైద్య చికిత్సకు ఈ డబ్బును ఉపయోగించుకోవాలని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. కాగా కెఎల్ రెడ్డి నవంబర్ 3న 2022 మరణించారు. దీంతో కెఎల్ రెడ్డి కుటుంబసభ్యులు ఆయన పేరున మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి, ప్రభుత్వం ఇచ్చిన రూ.15 లక్షల్లో, రూ.9లక్షలు మీడియా అకాడమీ కిచ్చి, దానిపై వచ్చిన వడ్డీతో, ప్రతి సంవత్సరం ''కెఎల్ రెడ్డి మెమోరియల్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు'' ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 3న ఇచ్చే ఈ అవార్డు గ్రహీత ఎంపికకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. అకాడమీ అధ్యక్షులు చైర్మెన్‌గా ఉండే ఈ కమిటీలో, ఇద్దరు ప్రముఖ జర్న లిస్ట్‌లు, కెఎల్ రెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు, అకాడమీ కార్యదర్శి సభ్యులుగా ఉండి, అవార్డు గ్రహీతను నిర్ణయి స్తారని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలియజేసారు.
ఈ మేరకు సోమవారం కెఎల్ రెడ్డి అల్లుడు లింగా రెడ్డి, అకాడమీ కార్యదర్శి వెంకటే శ్వరరావు అకాడమీ చైర్మెన్ అల్లం నారా యణ, కెఎల్ రెడ్డి తమ్ముడు ఇంద్ర సేనా రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.