Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదవ తరగతి పరీక్షా పత్రం లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని కార్పొరేట్, ప్రయివేటు యాజమాన్యాలకు తొత్తుగా మారి ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మిగిలిన పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.