Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్త్విద్యార్థుల ఏకాగ్రత చెడకుండా చూడాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు నిబద్ధతతో వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి విద్యార్థులు మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలను రాస్తున్నారని తెలిపారు. వారి ఏకగ్రత చెడిపోకుండా చూడాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులపైనే ఉంటుందని సూచించారు. ఒకరో, ఇద్దరో అనైతిక పద్ధతులకు పాల్పడితే మొత్తం ఉపాధ్యాయులు ఆ నిందను మోయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.