Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇకపై కిలోమీటర్ల లెక్కే...:టీఎస్ఆర్టీసీ నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో ఇప్పటి వరకు ఉన్న బస్‌పాస్ శ్లాబుల్ని ఎత్తేసి, వాటి స్థానంలో కిలోమీటర్ల లెక్కన పాసులు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. వీటిని మొదటగా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రవేశపెడుతున్నారు. పెరిగిన టోల్ చార్జీలను కూడా బస్‌పాస్ ఎమౌంట్తోనే కట్టించుకుంటారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్ దారులకు టోల్‌ప్లాజా రుసుం వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌పాస్ చూపించి.. ప్రతి రోజూ టోల్‌ప్లాజా టికెట్‌ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లున్నాయి. 100 కిలోమీటర్ల లోపు రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి 'మంత్లీ సీజన్ టికెట్' పేరుతో పాస్‌లను సంస్థ ఇస్తోంది. నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఈ పాస్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు. సాధారణ చార్జీతో పోల్చితే... ఈ పాస్ తీసుకుంటే 33 శాతం రాయితీని ఇస్తున్నారు. 20 రోజుల చార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని ఇప్పటి వరకు కల్పి స్తున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ సర్వీస్ నెలవారీ బస్ పాసుల్లో శ్లాబ్ విధానం అమల్లో ఉంది. ఉదాహరణకు.. ఒక ప్రయాణీకు డు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్లాబ్ విధానం ద్వారా 55 కిలో మీటర్లకు నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేసే వారు. ఇకపై 51 కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇస్తారు. దానితో పాటే టోల్ ప్లాజా రుసుం కూడా ఒకేసారి వసూలు చేస్తారు. దీనివల్ల ప్రయా ణీకులకు లాభం కలుగు తుందని ఎమ్డీ సజ్జనార్ పేర్కొన్నారు.