Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వద్దంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పాశిగామ, స్తంభంపల్లి మధ్య ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మూడ్రోజుల కిందట ఇథనాల్ పరిశ్రమ కోసం కేటాయించిన భూమిని చదును చేసే పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించగా ప్రజలు అడ్డుకుని పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆదివారం ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రజల ఆందోళన కొనసాగుతుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండటంతో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పాశిగామ, స్తంభంపల్లి గ్రామాల వారు పెద్దఎత్తున జగిత్యాల కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇథనాల్ పరిశ్రమ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కలెక్టరేట్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.