Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుట్టెడు దు:ఖంతో టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థి
నవతెలంగాణ- కడెం
అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు.. ఇదే సమయంలో తన భవిష్యత్‌కు బాటలు వేసే పరీక్ష ప్రారంభం.. ఈ క్రమంలో తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే.. పుట్టెడు ద్ణుఖంతో విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మొర్రిగూడెం గ్రామానికి చెందిన తక్కళ్ల వెంకటి(38) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. సోమవారం అంత్యక్రియలు జరపాల్సి ఉంది. అయితే, అతని కొడుకు తక్కళ్ల రోహిత్ పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉంది. ద్ణుఖాన్ని దిగమింగుకుని.. గుండె నిండా బాధతోనే రోహిత్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.