Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పేదలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభివద్ధికోసం అంకితభావంతో పనిచేసేది టీడీపీనేనని ఆపార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ నుంచి వివిధ పార్టీలకు చెందినవారు టీడీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ టీడీపీ హయంలో బీసీలకు స్థానిక సంస్థలలో మొదటి సారిగా రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అన్నారు. వీటి వల్ల వెనుకబడిన వర్గాలు నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. ఖమ్మం సభ, తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను విజయవంతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ద్వారా పార్టీ చేసిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, వార్డు వరకు పార్టీ శ్రేణులు కరపత్రాల ఇంటింటికి తీసుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు పొలంపల్లి అశోక్, కనకాల సాంబశివరావు, మెట్టుగాని శ్రీనివాస్‌తోపాటు పార్టీలో చేరిన వల్లభనేని జాహ్నవి, సుజాత, సురేఖ, సుమ, ఎం. లక్ష్మీ, జె. వినోద్, రామకష్ణ, వీరాచారి తదితరులున్నారు.