Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెర్ప్ సీఈఓకు నోటీసు అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దీర్ఘకాలికంగా పెండ ింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుచూ ఐకేపీ వీఓఏలు ఈనెల 17నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ఈ విషయంపై సెర్ప్ సీఈఓకు తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కనీస వేతనం రూ.26వేలు, రూ.10లక్షల సాధారణ బీమా, ఆరోగ్యబీమా కల్పించాలని కోరారు. సెర్ప్ నుంచి ఐడీ కార్డులు ఇవ్వాలనీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదన్నారు. మార్చి 16,17,18 తేదీల్లో మూడు రోజులపాటు టోకెన్ సమ్మె చేసినా ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందనలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఓఏలందరూ పారిశ్రామిక వివాదాల చట్టం1947 సెక్షన్ 22, సబ్‌సెక్షన్(1) అనుసరించి ఈనెల 17 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు కె.రాజ్‌కుమార్, ఎం.నగేష్, కోశాధికారి సుమలత, ఉపాధ్యక్షురాలు వసియాబేగం తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు : ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
-కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి.
-రూ.10లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.-సెర్ప్ నుంచి ఐడీ కార్డులు ఇవ్వాలి.-గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధంలేకుండా ప్రతినెల వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలి.
-వీఓఏలతో ఆన్లైన్ పనులు చేయించకూడదు.
-వీఓఏలపైనా మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉంటున్న కారణంగా ఎస్‌హెచ్‌జీలకు వీఎల్ఆర్, అభయహస్తం డబ్బులు చెల్లించాలి.
-ఎస్‌హెచ్‌జీ/వీఏ లైవ్ మీటింగ్స్ రద్దు చేయాలి.
-అర్హులైన వీఓఏలకు సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలి.