Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
నోట్ రెండు ఫోటోలు వాడగలరు. రైతన్నకి శాపంగా మారిన ధరణి పోర్టల్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడారు. భూమి మోకాపై ఒక రైతు ఉంటే పట్టా మరో రైతు పేరు మీద ఉందని రైతుబంధు ఇంకో రైతుకు పడుతుందని ఇలాంటి సంఘటనలుగా ఉన్నాయని వీటికి కారణమైన రైతుబంధును వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఐదు సంవత్సరాలుగా రుణమాఫీకి ఎదురుచూస్తున్న రైతాంగానికివెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతూ రైతులను దగా చేస్తున్నదని వాపోయారు. రైతే దేశానికి వెన్నుముక అని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తాం అని, రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల ఋణమాఫీ చేస్తా అని, రైతులకు శాశ్వత పట్టాలు అందిస్తా అని, వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టంపరిహారం ఇస్తా అని 2018 లో రెండో సారి గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పటివరకు ఋణమాఫీ చేయకుండా, పట్టాలు అందించకుండా, నష్ట పరిహారం ఇవ్వకుండా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. పంట పెట్టుబడికై రైతు బంధు పథకాన్ని అమలుచేసి వందల, వేల ఎకరాల భూస్వాములను పెంచిపోషిస్తూ చిన్న సన్నకారు రైతులను దగా చేస్తూ, కౌలు రైతులను మోసం చేస్తూ, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా రైతు శ్రమకు గౌరవం లేకుండా చేస్తున్నాడని, పంట కొనుగోలు సమయంలో కోత విధిస్తున్న మిల్లర్లకు కొమ్ము కాస్తూ రైతు శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. రైతే రాజు అంటూ రైతును నట్టేట ముంచుతున్నాడని అన్నారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్, ఏకకాలంలో పంట ఋణమాఫీ, పంటకు కనీస మద్దతు ధర, సాగు చేసుకునే రైతులకు పహనీలు, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, కొత్త పంట రుణాలు, భూసార పరీక్షలు, భూ సంస్కరణల చట్టం లాంటి పథకాలు తీసుకువచ్చి రైతును రాజు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి బ్రతుకులు మారుతాయని అనుకుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన గోదావరి జలాలను మేడిపెళ్లి, మెడ గడ్డ లోని వారి స్వంత భూములకు తరలిస్తూ మనకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన ఫలితం శూన్యం అని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుతింటూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని అన్నారు. ఇప్పటికి అయిన రైతులకు వెంటనే ఉచిత విద్యుత్, ఋణమాఫీ, పంట నష్టపరిహారం, భూ నిర్వాసితులకు నష్ట పరిహారం, పంటకు కనీస మద్దతు కల్పించి గిట్టుబాటు ధరను కల్పించాలని, సాగు భూములకు పోడు భూములకు శాశ్వత పట్టాలు అందించాలని, ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలబడి రైతుల కోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అధికార పార్టీలకు చేతకాకపోతే వెంటనే గద్దె దిగండి మేము రైతును రాజు చేస్తాం అని అన్నారు. రైతులను దగా చేసే ప్రభుత్వాలను కూల్చి రైతుల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రశ్నించినందుకే జైలు ఫైన్ లు అంటూ రాజ్యాంగాన్ని కాలరాస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఇమేజ్ దేశవ్యాప్తంగా యాత్రతో పెరగడంతో కట్టడి చేసేందుకే కుట్రలు పన్ని జైలు శిక్షలు పార్లమెంటు సభ్యత్వ రద్దు కార్యక్రమాలను చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగాల ప్రభుత్వం మనీ మోడీ ప్రభుత్వం అదాని అంబానీలకు వేలకోట్ల ప్రజల ఆస్తులను దోచిపెడుతోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఋణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ కార్డు ఉన్నవారికి 12000 రూపాయలు, రైతు బంధు 15000 రూపాయలు, కౌలు రైతుకు కూడా రైతు బంధు కల్పిస్తాం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పోడు భూములకు, సాగు భూములకు శాశ్వత పట్టాలు అందిస్తాం, రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం అని రైతుల కొరకు పోరాడే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, జాలపు అనంత రెడ్డి, ఎండి. అఫ్సర్ పాషా, కృష్ణా రెడ్డి, కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి వల్లేపల్లి శివయ్య, కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, వాకిటి రామకృష్ణా రెడ్డి, కాసిడి శ్రీనివాస్ రెడ్డి, చౌలం వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు బండి శ్రీనివాస్, ఆకుతోట చంద్రమౌళి, జిల్లా నాయకులు అర్రేమ్ లచ్చుపటేల్, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, భూక్య సారయ్య, చింత క్రాంతి, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, సనప సమ్మయ్య, కట్ల జనార్దన్ రెడ్డి, రేగ కళ్యాణి తదితర నాయకులు పాల్గొన్నారు.