Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆచార్య వినోభా బావే స్పూర్తితో భూదాన ఉద్యమంలో పాల్గొని వందలాది ఎకరాల భూమిని పేదలకు ధారాదత్తం చేసిన వేదిరే రామచంద్రా రెడ్డి, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధులు, నల్లగొండ మొట్టమొదటి లోక్‌సభ సభ్యుడు రావి నారాయణరెడ్డి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని వారి వారసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం భూదాన్ రామచంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు వేదిరే వినరు చంద్రారెడ్డి, డాక్టర్ వేదిరే ప్రభోద్ చంద్రారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధులు రావి నారాయణరెడ్డి మనుమరాలు రావి ప్రతిభ తదితరులు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వారి విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీద నెలకొల్పడం ద్వారా వర్తమానానికి భూదాన్ ఉద్యమం ప్రాశస్త్యం, తెలంగాణా సాయుధ పోరాట స్ఫూర్తిని అందించిన వారమౌతామని ఈ సందర్భంగా వారు మంత్రికి వివరించారు.