Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని టీఎస్ రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని టీఎస్ రెడ్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో వంద మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని ఆయనతో పాటు టీఎస్రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, జనరల్ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారికి అద్దాలు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నదని తెలిపారు. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.