Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి 2+2 పోలీసు భద్రత తిరిగి కల్పించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలి పారు. ఈ పిటిషన్ను జస్టిస్ విజరుసేన్రెడ్డి మంగళవారం విచారించారు. మాజీ ఎమ్మెల్యే వినతిపత్రంపై 10 రోజుల్లోగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ, నిఘా అదనపు డీజీలను ఆదేశించారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడు 2+2 భద్రత ఉందని, దీనిని ఇప్పుడు 1+1కి తగ్గించారని పిటిషనర్ వాదన. భద్రత పెంపు అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది.