Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మార్గదర్శి చిట్‌ఫండ్ లావాదేవీలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తును ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ పేరుతో మార్గదర్శి బ్రాంచీలకు చెందిన 30 మంది మేనేజర్లకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. ఈ లంచ్‌మోషన్ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారిం చారు. దర్యాప్తు పేరుతో బ్రాంచి మేనేజర్లపై కఠిన, బలవంతపు చర్యలు తీసు కోరాదని మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తును కొనసాగించవచ్చునని చెప్పారు. విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.