Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. గతనెల 15న ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈనెల 24వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమైంది.
ఈనెలాఖరులో ఇంటర్ ఫలితాలను వెల్లడించే అవకాశమున్నట్టు సమాచారం. మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం మోడ్రల్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. 451 మంది దరఖాస్తు చేస్తే 447 (99.12 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. నలుగురు (0.88 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొ న్నారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం కృషి చేసిన జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, తపాలా, టీఎస్ఆర్టీసీ, వైద్యారోగ్య, ట్రాన్స్కో, బీఎస్ఎన్ఎల్ శాఖల అధికారులకు ధన్యవాదాలు ప్రకటించారు.