Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ఆదేశాలు
- త్వరలోనే పోడు భూములకు పట్టాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గృహలక్ష్మి (ఇంటి జాగాలున్న వారికి దాని నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం) పథకం అమలు కోసం వెంటనే విధి విధానాలను రూపొందించాలంటూ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. మంగళవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు సంబంధించిన సమీక్షా సమావేశానంతరం ఆయన కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని ఉన్నతాధికారులకు సూచించారు. గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలనీ, దళిత బంధును కొనసాగించాలని సీఎం నిర్ణయించారు.