Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని.. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కొనియాడారు. దళిత సమాజాభివద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ 116 వ జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే గొప్ప దార్శనికుడని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితో పాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, దేశ పురోభి వృద్ధికి పునాదులు వేసారని గుర్తుచేశారు. అణచివేతకు గురైన దళితులు, వెనుకబడిన తరగతుల ఉన్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం నిరం తరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా, వారి సంక్షేమ విధానాలకు బాటలు వేశారన్నారు.ఆయన కార్మిక లోక పక్షపాతి అని సీఎం కీర్తించారు. ప్రజలు ప్రేమగా ఆయన్ను 'బాబూజీ' అని పిలిచేవారని గుర్తుచేశారు. బాబూజీ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు.