Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తీవ్రవాదంతో ఏమీ సాధించలేమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్ర జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారంనాడాయన్ని మాజీ మావోయిస్టు గజల సత్యంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటు, జరుగుతున్న అభివద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. ఆగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయసింహా రెడ్డి, బీఆర్‌యస్ సీనియర్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి, 17 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి విడుదలై, జనజీవన స్రవంతిలోకి మాజీ మావోయిస్టు గజ్జల సత్యంరెడ్డి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణా పునర్నిర్మాణంలో సత్యంరెడ్డి భాగస్వామి కావాలని కోరారు. ఈ సందర్బంగా సత్యంరెడ్డి మాట్లాడుతూ తాను మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లేముందు ఉన్న తెలంగాణకు ఇప్పటికీ చాలా మార్పు ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను ఆయన కొనియాడారు.