Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 8న రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం ఆమె సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చూడాలని పోలీసు అధికారులను, సరిపడినన్ని అగ్నిమాపక పరికరాలను పర్యటన స్థలంలో అందుబాటులో ఉంటారని అగ్నిమాపక సిబ్బందిని కోరారు. అదే విధంగా వైద్య సిబ్బంది, అంబులెన్స్, ఇతర సౌకర్యాలు ఉండేలా చూడాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. ప్రధాని ఉపయోగించే రోడ్డు మార్గం మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాని పర్యటించే అన్ని చోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ పోలీస్, రైల్వే అధికారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.