Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ ఎన్నికల ఖర్చు భరిస్తానంటూ సీఎం కేసీఆర్ అన్నట్టు తెలిసిందని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అంత సొమ్మేక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ ఆస్తుల వివరాలు అందరికీ తెలుసన్నారు. 2014 ముందు కేసీఆర్కు పామ్ హౌస్ ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల కూటమికి చైర్మెన్ను చేస్తే 2024 ఎన్నికలకు ఖర్చు చేసేటంత డబ్బులు ఎక్కడివన్నారు. దేశంలో కేసీఆర్ అంత అవినీతి పరుడు ఎవరూ లేరని ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో 50శాతం కూడా పూర్తి చేయలేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. తొమ్మిదేండ్లుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఆదరా బాదరాగా నోటిఫికేషన్లు ఇస్తే...పేపర్ లీక్ అయిందని విమర్శించారు.