Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్‌కు గాదరి కిషోర్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లోక్‌సభ సభ్యుడిగా ఏనాడైనా పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడారా? అంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ విద్యార్హతల గురించి బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారనీ, వాటిలో ఏది నిజమో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటి నిధులపై ఢిల్లీలో లాంగ్‌మార్చ్ నిర్వహించాలంటూ సంజరుకు హితవు పలికారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఎక్కడ ఏదీ జరిగినా దాన్ని కేసీఆర్ కుటుంబంతో ముడిపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేతలకు హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో ఏ అంశంలోనైనా చర్చించాలనీ, ఆ చర్చలో కేసీఆర్ తప్పుగా మాట్లాడితే తాను పదవికి రాజీనామా చేస్తానని బండికి సవాల్ చేశారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభ కోణం పెద్దది.. అక్కడ శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించామనీ, ఈ నెల 8న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ తెలంగాణ హక్కులను కాలరాసిన పార్టీ అని విమర్శించారు. పేపర్ లీకేజీలపై ఆ పార్టీ నేతల కుట్రలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు.