Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు, ఉద్యోగ సంఘాల నేతల కృతజ్ఞతలు
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరణిస్తే అలాంటి వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా చాలా రాష్ట్రాల్లో అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీశాఖ సిబ్బంది మరణిస్తే పరిహారం అందలేదని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. తొలిసారి ఇలాంటి విధాన పరమైన నిర్ణయం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికు మారిలకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్,హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం.డోబ్రియాల్తోపాటు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, వివిధ అటవీ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు కతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు హరితహారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.