Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పదవ తరగతి పేపర్ లీకేజ్ నేపథ్యంలో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనను గాలికొదిలేసి రాజకీయ విధ్వంసంలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ విచారణ కొనసాగుతుండగానే పదవ తరగతి ప్రశ్నాపత్రాలు కూడా లీకేజ్ జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. అటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. పదవతరగతి పేపర్లు లీక్ అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. లక్షల మంది విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేయడం కాదనీ, ఇక కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.