Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య మహిళ కార్యక్రమంలో స్క్రీనింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వరసగా నాలుగో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 9,806 మందికి పరీక్షలు నిర్వహించారు. గత వారం 7,965 మంది రాగా ఈ వారం రెండు వేల మంది పెరిగారు. కాగా తాజాగా పరీక్షించిన వారిలో 934 మందిని చికిత్స నిమిత్తం పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ కోరింది.