Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రాన్స్ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరికి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కార్పొరేట్ ఆస్పత్రు ల్లోనూ ఉచితంగా వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 58,918 గుర్తించిన్నట్టు మంత్రి వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ పర్సన్స్ హక్కుల రక్షణ కై రూపొందిన నియమాలను 2020 సెప్టెంబర్ 29న గెజిట్లో ప్రచురించినట్టు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 400 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. మొదటి సారిగా ట్రాన్స్ ఉత్సవం జరుపు కోవడం ఎంతో అభినందనీయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి 19 మంది సభ్యులతోరాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంస్థ ఉన్నతాధి కారులు భారతి హాలికేరి, దివ్యదేవారజన్, శైలజ పలువురు ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.