Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ ధర్నాకు రాష్ట్రం నుంచి వేలాదిగా తరలిన కార్మికవర్గం
నవతెలంగాణ- హైదారాబాద్బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరగనున్న ధర్నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది కార్మికులు తరలివెళ్లారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగుభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో మూడు నెలలపాటు పెద్దఎత్తున క్యాంపెయిన్ జరిగిందని పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వం కార్పొరేటికరణ విధానాల వల్ల రాష్ట్రంలోని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, పెట్రోలియం, రైల్వే, ఇన్సూరెన్స్, ప్రభుత్వరంగ బ్యాంకులు, హైవేలు, ప్రజల సంపదకు ప్రమాదం ఏర్పడిన అంశాలను విస్తృతంగా క్యాంపెయిన్ చేసినట్టు వివరించారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం-2022, విద్యావిధానం, ఎంవీయాక్టు- 2019, తదితర నిర్ణయాలు కార్మికహక్కులను హరిస్తున్నాయని అన్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే ధర్నాలో 10లక్షల మంది పాల్గోనున్నారని, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్మికులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో బయలుదేరినట్టు చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం సికింద్రాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్కు బయలు దేరినవారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆఫీస్ బేరర్స్ భూపాల్, జె.వెంకటేష్, ఎస్వీ.రమ, పి.జయలక్ష్మి, వంగూరు రాములు, పద్మశ్రీ, కె.ఈశ్వర్రావు, కూరపాటి రమేష్, పి.రాజారావు, ఆర్.కోటంరాజు, వై.సోమన్న, సునీతలతోపాటు వివిధ జిల్లాల నేతలు ఉన్నారు.