Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ట్రైబల్ టీచర్లకు పదోన్నతులు, బదిలీల్లో జరిగే అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) డిమాండ్ చేసింది. బుధవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానంతరం అధ్యక్షులు ఎస్ హరికిషన్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి వి శ్రీనునాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రైబల్ టీచర్ల సమస్యల కోసం ఐక్యంగా పనిచేయాలని కోరారు.